10 నుండి మీ ఇంటికి - మీ భూమి : తాసిల్దార్ 5 ఆగస్టు, బుధవారంఅనంతపురం - ఓబులదేవరచెరువు - ఈ నెల 10 నుండి గ్రామీణ ప్రాంతాలలో మీ ఇంట మీ భూమి కార్యక్రమాన్ని చేపట్టనునట్లు తాసిల్దార్ మోహన్ దాసు గురువారం విజయస్వప్నం.నెట్ ప్రతినిధితో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతుల సమక్షములో భూములు, కుటుంబ వాటా సవరణలు, భూమి కొనుగోలు అమ్మకాలు పత్రాలు, కుటుంబ యజమాని మరణాంతరం మార్పులు, ఇతర స్టాంపులు తదితర భూ విస్తీర్ణము వివరాలు పరిశీలించి ఈపాసు పుస్తకాల కొరకు ప్రతిపాదన పంపేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుండి 31 వరకు గ్రామా సభలలో రైతులు 10-1, పాస్ బుక్కులు తదితర ఆధారాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.