అంతా... రామమయం...! ఊరు వాడ అంతా... రామమయం...!! 18 April, Thursday అనంతపురం - బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఊరూవాడా అంతా రామమయం నామస్మరణలతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు.దేశమంతటా రామాలయంల్లో పూజారి అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు వడపప్పు, పానకం, తీర్ధప్రసాదాలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రామాలయంలో పూజలు నిర్వహించి, సీతారాములవారి ప్రతిమలతో వాహనంపై ఊరేగింపు ఉత్సవాలు, వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీరామ భక్త మండలి యువత జై శ్రీరామ్, జైజై శ్రీరామ్ అంటూ బైక్ ర్యాలీ నిర్వహించి, శ్రీరాముడు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక వాహనంపై పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Click for more pics >>