ఓడిచెరువు, కదిరిలలో భారీ వర్షం వర్షంతో హర్షించిన రైతులు 20 ఆగస్టు, గురువారంఅనంతపురం - ఓబులదేవరచెరువు - ఓడిచెరువు మండలం, కదిరి డివిజన్ లలోని వివిద గ్రామాలలో బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కులిసాయి. ఓడిచెరువులో చిరుజల్లులతో ప్రారంభమై రాత్రి కుంభవర్షం కురిసింది. గతవారం నుండి వేసవి తాపంతో వేడికి తల్లడిల్లగా ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది. మండలంలో చిరుజల్లులు కురవడంతో రైతులు పొలాలవైపు వెళ్ళి వేరుశనగ పంటని పరిశీలిస్తుండంగానే భారీ వర్షం కురవడంతో పలువురు రైతులు హర్షం వ్యక్తపరిచారు. గత పదేళ్ళలో ఇలా భారీవర్షం కురవలేదని ఈ వర్షంతో పాటు వేరుశనగ, ఇతర పంటలు పండించేందుకు అవకాశం కలిగిందన్నారు. బుధవారం సాయంత్రం నుండి గురువారం అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తుండటం విశేషం.