2016 రంజాన్ నెల ఉపవాసాలు ఆరంభం జూన్ 6వ తేది నుండి జూలై 6 వరకు 7 జూన్, మంగళవారం జాతీయం - వార్త - ఈ సంవత్సరం "రంజాన్ నెల" జూన్ 6 సోమవారం నుండి ప్రారంభిస్తారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ముస్లిం మతభక్తులు కఠినమైన ఉపవాసం ఆచరించు సమయము. ఇస్లామిక్ క్యాలెండరు ప్రకారం 8వ నెల సాబాన్ నెల ముగిసిన తరువాత, మొదటి నెలవంక వీక్షణంతో రంజాన్ నెల మొదలై, 30 రోజులు కఠినమైన ఉపవాస దీక్షతో కొనసాగుతుంది. ఇస్లాం మతం ప్రకారం రంజాన్ నెలలో తెల్లవారు ఝామునుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండటం అనేది ఐదు మూలస్థంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.