ఆదారుమాయాజాలానికి రైతుల కష్టాలు 21 ఆగస్టు, శుక్రవారం 10-1 ఫాంలో రైతు ఫోటోకి బదులు బాలిక ఫోటోఅనంతపురం - ఓబులదేవరచెరువు - ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆదార్ లింక్ తప్పనిసరిఅని ప్రకటనలు గుప్పించడంతో గత సంవత్సరం అన్నివర్గాల ప్రజానీకం ఆదార్ నమోదు కోసం మీసేవ, ఇతర కంప్యూటర్ సెంటర్లో (కదిరి, ఆమడగూరు) త్వరగా నమోదు చేస్తారని వెళ్ళడంతో ఇదేఅదునుగా బావించి అదనపు రుసుము తో తప్పుల జాబితాలను నమోదు చేయడంతో విధ్యార్థులు, నిరుద్యోగులు, ఫింక్షనుదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఐతే ఆదార్ తప్పులతడకతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి మీఇంటికి మీభూమి కార్యక్రమంలో రైతులకు చెందిన 10 – 1 వివరాల జాబితాలో రైతుల పేర్లు, సర్వే నెంబర్ సరైనదిగా సూచించినా, రిమార్కు ఆదార్ లో సంబందిత రైతు ఫోటోకు బదులు అరుసంవతరాల బాలబాలికల ఫోటోలు ఉండటంతో రైతులు లబోదిబో మంట్టు౦నారు. ఇప్పటికైన అధికారులు రైతుల కోసం ప్రతేకంగా ఆదార్ నమోదు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.