పంట నష్టానికి ఆర్ధిక సహాయం చేయాలి సంక్షిప్త సమాచారం 20 ఆగస్టు, గురువారం పంట నష్టానికి ఆర్ధిక సహాయం చేయాలిఅనంతపురం - ఓబులదేవరచెరువు - మండలంలోని పాణా కెత్తపల్లి గ్రామంలో 5ఎకరాల పొలంలో పెసర పంటను జింకలు మేయడంతో పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం చేయాలంటూ బుధవారం రైతు వెంకటాద్రి నాయుడు తహసిల్దారు మోహన్ దాస్ కి వినతి పత్రం ఆందజేశారు.నూతన ఎం.పి.డి.ఒ గా నాగరాజు భాధ్యత స్వకరణమండల పరిషత్ అభివృధ్ది ఆధికారిగ నాగరాజు బుధవారం భాధ్యతలు స్వకరించారు. చలమత్తూరు నుండి బదిలీపై నూతనంగా భాధ్యతలు స్వకరించి ప్రజా సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఐతే ఇక్కడ వున్న ఎం.పి.డి.ఒ శ్రీరాములు గాండ్లపెంట మండలానికి వెళ్ళారు. నారాయణ విధ్యాసంస్థలను రద్దు చేయాలని నిరసన రాష్ట్రంలో నారాయణ విధ్యాసంస్థలు నిభంధనలకు విరుధ్దంగా నిర్వహస్తున్న కళాశాలలను తమ యాజమాన్యం విధ్యార్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నా క్యాబినెట్ పదవులో వున్న నారాయణ ఆండదండలతో యాజమాన్యం నిర్లక్షం చేయడంపై విధ్యాసంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆక్కులప్ప నాయక్ ఆద్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల నాయకులు గోపాల నాయక్, రాజశేఖర్ కళాశాల విధ్యార్థులు ర్యాలి నిర్వహంచారు. ఆంబేద్కర్ సర్కల్ వద్ద విధ్యాసంస్థల ఆధినేత ప్రభుత్వ క్యాబినెట్ లో పదవికి రాజినామా చేయాలని, కళాశాలల్లో రాగింగులు, యాజమాన్య వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్నం స్పందించలేదంటు విమర్శిస్తూ మంత్రి నారాయణ దష్టిబొమ్మను ధగ్దం చేశారు.