ఐపీఎల్ తరహాలో జర్నలిస్టులకు క్రికెట్ నిర్వహించడం గ్రేట్ కొడిమి జర్నలిస్ట్ కాలనీ ఒకసారి సందర్శిస్తాను - మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయం కడప విన్నర్స్, వైజాగ్ రన్నర్స్ ట్రోఫీలను అందించినజిల్లా కలెక్టర్ గౌతమి 3 March, Sunday అనంతపురం - రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ క్రికెట్ జట్లు అనంతపురంలో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అందరూ ఒకే వేదికపై పాల్గోని ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్లు నిర్వహించడం గొప్ప విషయమని అనంత జిల్లా కలెక్టర్ గౌతమి అన్నారు. యూనియన్ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయమని ఒకే వేదికపై ఇంత మంది జర్నలిస్టులను ఒకతాటిపైకి తీసుకొనిరావడం గొప్ప విషయమని కలెక్టర్ గౌతమి అన్నారు. అనంతపురం నగరంలోని ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ యూనిటీ కప్ 2024 ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభ మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ ఎండి అంకే ముత్యాలు,సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎంతో పని ఒత్తిడి మీద ఉంటారని, అలాంటి వారి కోసం అనంతపురంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మానసిక ఉల్లాసంతో పాటు ఆటవిడుపుగా ఉంటుందన్నారు.అలాగే గతంలో తాను ఆర్డీవోగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ కాలనీ సంబంధించిన ఫైల్స్ ను త్వరతగతిన పూర్తి చేసానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టులకు అనంతపురం ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మచ్చా రామలింగారెడ్డి క్రికెట్ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కడప జిల్లాతో కూడా తనకు అనుబంధం ఉందని గెలిచిన కడప జట్టు సభ్యులకు పలకరించారు. కార్యక్రమంలో భాగంగా ఫైనల్స్ లో గెలిచిన కడప జట్టుకు అలాగే రన్నర్స్ గా నిలిచిన వైజాగ్ జట్టుకు ట్రోఫీలను అందించారు దీంతోపాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ బెస్ట్ బ్యాట్స్ మెన్ బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీలను అలాగే టోర్నమెంట్లో పాల్గొన్న టీములన్నిటికీ జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మార్కండేయులు, నాగభూషణం, భోగేశ్వర్రెడ్డి, రసూల్ తదితరులతో పాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఖాన్, విజయరాజు, షాకీర్, రఘు, శ్రీకాంత్, చక్రి, భీమా శివ ప్రసాద్, రవి, సాదిక్, ఈశ్వర్, చక్ర, సాయి, త్యాగరాజు, వాలి తదితరులు పాల్గొన్నారు.