దైవ దుశానగా భావించి మహిళా పైన దాడి..! 27 February, Tuesday అంతర్జాతీయం - భక్తి-ఆరోగ్యం - దైవ దుశనగా భావించి ఒక అమ్మాయి పైన రాళ్లు రువ్వుతూ, చంపేయాలి అంటూ స్తానికులు నినాదం చేస్తూ దాడి చేశారు, పోలీసుల జోక్యంతో అమ్మాయి ప్రాణాలకు ముప్పు తప్పింది.వివరాల్లోకి వెళితే, 26 ఫేబ్రవరి సోమవారం పాకిస్తాన్ లాహోర్ నగరంలో ఒక అమ్మాయి అరబిక్ బాషలో ముద్రించబడిన దుస్తులను దరిచి వెలుతూవుండగా, ఆ ముద్రించిన అక్షరాలను గమనించిన అక్కడి స్థానిక ప్రజలు, తమ దైవ దుషణకు సంబందించిన పదాలుగా అనుకోని ఆ అమ్మాయి పైన దాడి చేసారు. సమయానికి పోలీసులు జోక్యం చేసుకోవడం తో అమ్మాయి ప్రాణాలతో బయట పడింది. ఎంతో కోపం తో వున్న అక్కడి ప్రజలు సదరు వస్రాల కంపెనీ పైన కటిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. ఈ వస్త్రాల డిజైన్ చేసింది ఖతర్ కు చెందిన కంపెనీ. వారు స్పందిస్తూ "అరబిక్ మా వాడుక బాష, దుస్తుల పై ముద్రించిన పదాలకు అర్థం అందమైన జీవితం" అని వివరణ ఇచ్చారు.