జర్నలిస్టుపై దాడి దుర్మార్గం.. తహశీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా ఎస్ఐ,తహసీల్దార్లకు వినతులు 19 February, Monday అనంతపురం - ఓబులదేవరచెరువు - సమాజంలో ఫోర్త్ పిల్లర్‌గా ఉన్న మీడియా వ్యవస్థపై దాడులు దుర్మార్గమని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండలంలోని పాత్రికేయులు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్ జాకీర్, ఎస్ఐ వంశీకృష్ణకు వినతి పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా పలువురు విలేకరులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణపై కొందరు వైకాపా నాయకులు తీవ్రంగా దాడి చేయడం హేమమైన చర్యని మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో ఒక పత్రిక విలేకరిపై దాడి జరిగితే ఇంకా సామాన్యులకు ఏమి రక్షణ కల్పిస్తారన్నారు.ప్రశ్నించే స్వరాలపై దాడులు జరపడం హేయమైన చర్యని,వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ చీకటి శక్తుల అరాచకాలపై వార్తా కథనాలతో ప్రజల్లో చైతన్యం కల్పించే జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. పత్రికా స్వేచ్ఛను హరింపజేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతూ.... జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్.షాజహాన్ (ఆంధ్రజ్యోతి) బుద్దల. గోపీనాథ్ రెడ్డి (టీవీ5)రంగారెడ్డి (ఆంధ్రప్రభ) శ్రీనివాసులు(వార్త) శిరిగం. చంద్రశేఖర్ రెడ్డి (మనం) ఆదిమూర్తి( విశాలాంధ్ర )లక్ష్మన్న (సూర్య) మొమీన్. ఫయాజ్ (ప్రజాశక్తి )రంగప్ప( అనంత భూమి) మౌలా (మహా న్యూస్) మహబూబ్ బాషా (బి ఆర్ కె న్యూస్) భుజంగరావు (సివిఆర్ న్యూస్)చందు (రాజ్ న్యూస్) ఆనంద్ (అనంత జనశక్తి )అయ్యప్ప (ధర్మపోరు) జయచంద్రరాజు (వజ్ర భారతి) నరసింహులు( అక్షర) పచ్చర్ల ఆంజనేయులు నాయుడు (విజయ స్వప్నం) లక్ష్మీపతి (అనంత ఫోకస్ ) మీడియా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడి హెయ్యమైన చర్య జగన్ సభలో మీడియా మీద దాడి పై అమానుషమని డీసీసీ ప్రధాన కార్యదర్శి బొగ్గిటి ముని కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ఖండించారు.జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైకాపా దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. విలేకరి పై దాడి చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలి:-సిపిఐ నాయకులు రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరిపై వైస్సార్ పార్టీ నాయకులు విచక్షణంగా దాడి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో మండల డిప్యూటి తహసీల్దారు జాకిర్ కీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఈ లాంటి రౌడీ ముకల దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని,పత్రిక విలేకరుల పైన దాడి అత్యంత హేమమైన చర్యని,మృగాల కంటే హీనంగా విలేకరిపై దాడికి పాల్పడ్డారని వేలాది మంది పోలీసులు బందోబస్తూలో ఉన్న విలేకరిపై దాడి ఆపకపోవడం సిగ్గు చేటని,ఇ ప్పటికైనా నిందుతలను అరెస్ట్ చేయాలనీ వారు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండలకార్యదర్శి చలపతినాయుడు,మహిళా నాయకురాలు రత్నబాయ్,కృష్ణారెడ్డి,రమణ, రవి తదితరులు పాల్గొన్నారు.గోరంట్ల మండల జర్నలిస్ట్ ఈశ్వర్ పై దాడి మరువకుండనే రాప్తాడు సియం సిద్ధం బహిరంగ సభ వద్ద ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కృష్ణపై వైకాపా అల్లరిమూకలు దాడి చేయడం హేయమైన చర్య అంటూ....దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సోమవారం హిందూపురం ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులు నిరసన తెలిపి ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. Click for more pics >>