తనకల్లు ప్రజా ప్రెస్ క్లబ్ లొ అఖిల పక్ష సమావేశం పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు 30 January, Tuesday - శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు - తనకల్లు మండల ప్రెస్ క్లబ్ లో మంగళవారం ప్రజా సమస్యల పై సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ప్రజా సమస్యలు పైన చర్చ చేస్తూ కార్మిక చట్టాలపై అవగాహన,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా నిరంకుశ వైఖరి వాటి విధానాలు పైన టీడీపీ,కాంగ్రెస్,సిపిఎం,సిపిఐ,బిసి సంఘాల నాయకులు,రైతు సంఘం నాయకులు సమక్షంలో మండలంలో జరుగుతున్న విధానాలుపైన సమీక్షించి,భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు(విజయస్వప్నం. నెట్ రిపోర్టర్,కదిరి)