భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: సిఐటియూ, కార్మికుల ర్యాలీ 30 January, Tuesday - ఓడిచెరువు - శ్రీసత్యసాయి జిల్లా,ఓడిచెరువు మండలంలో భువన నిర్మాణ కార్మికులకు ఇళ్లపట్టాలు,గృహాలు మంజూరు చేయాలని సిఐటియూ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ కూడలి నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి,తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,మండల కార్యదర్శి పోరాటాల శ్రీరాములు,అధ్యక్షులు కుల్లాయప్ప మాట్లాడుతూ.... భవన నిర్మాణ కార్మికులు కోనేళ్లగా గూడు లేక కష్టపడి కూలి చేసుకొని బాడుగలు కట్టుకోలేక కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నరని,రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేసి సమస్యల పరిష్కారం చేయాలని,లేని పక్షంలో వివిధ రూపాలలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమం లో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కిష్టప్ప,కార్యదర్శి రవి,కోశాధికారి సూరి,శ్రీనివాసులు,మహేంద్ర,సహాయ కార్యదర్శి కేశవ,రమణప్ప,మహిళ నాయకురాలు మనీ,గంగాదేవి, తదితర భవన కార్మిక సభ్యులు పాల్గొన్నారు(విజయస్వప్నం. నెట్ రిపోర్టర్,ఓడిచెరువు)* కదిరిలో కొనసాగుతున్న ఆర్సిపి దీక్షలు కదిరి - రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజు దీక్ష కొనసాగాయి.రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కదిరి నియోజక కార్యదర్శి టీ ఎండి ఇలియాజు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో పలువురు పాల్గొని ఈసందర్బంగా పలు డిమాండ్లను వివరించారు.సర్వేనెంబర్ 83 కుంభకోణంపై విచారణ జరిపించాలని,సర్వే1735-1ఏ1 విస్తీర్ణంలో ఉద్యోగులకు ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని,అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని,పేదల ముసుగులో ధనవంతులకు పట్టాలు పంపిణి చేసిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నాయకులు అరుణ్ కుమార్,రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సుగుణమ్మ,గంగులమ్మ,హరీష్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు(విజయస్వప్నం రిపోర్టర్, కదిరి)* నిధులు మంజూరు చేయాలని సర్పంచులు దీక్షలు అనంతపురం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్,రాష్ట్ర సర్పంచుల సంఘం ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్ష నిర్వహించినట్లు తెలిపారు.రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు ఇస్మాయిల్,రంగయ్య,డేగల కృష్ణమూర్తి,భూషణ్,పెండ్యాల శ్రీలత జనసేన పార్టీ లెనిన్,సర్పంచ్ సిపిఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాలప్ప తదితరులు మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్పంచులకు ఇవ్వవలసిన 14,15 ఆర్థిక సంఘం నిధులు 8629.79 కోట్లు రూపాయ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో సర్పంచులను ఉత్సవ విగ్రహాల చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.అలాగే 16 డిమాండ్లను అమలపరచాలని కోరారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచులు పాల్గొన్నారన్నారు. Click for more pics >>