బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ 29 January, Monday - ఓడిచెరువు మండల వ్యాప్తంగా గృహ నిర్మాణాలు చేపట్టి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు బిల్లులు చెలించడంలో జాప్యం చేస్తున్నారని,లబ్ధిదారులకు సిమెంట్,బిల్లులు మంజూరు చేయాలని సోమవారం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి మున్నా డిమాండ్ చేశారు.గృహ నిర్మాణ పనులు చేపట్టి వివిధ దశల్లో అర్థంతరంగా నిలిచిపోయి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని డిప్యూటీ తహసీల్దార్ జాకీర్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు(విజయస్వప్నం రిపోర్టర్) దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ప్రత్యేక పూజలు ఓడిచెరువు మండలం అలాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీ సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ అక్కదెవతల ఆలయంలో సోమవారం కొత్త చెరువు మండలం యరబల్లి గ్రామానికి చెందిన సుధాకర రెడ్డి,శోభ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు(విజయస్వప్నం రిపోర్టర్)