పెండింగ్ ఓటర్ జాబితా వివరాలపై సమీక్ష 29 January, Monday - కదిరి - శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి,ఓటర్ నమోదు అధికారి అధ్యక్షతన సోమవారం రెవిన్యూడివిజనల్ కార్యాలయములో కదిరి నియోజకవర్గం పరిధిలో బూత్ స్థాయి అధికారులకు,ఎలక్షన్ సూపర్ వైజర్లకు,తహసీల్దార్లకు, కదిరి మునిసిపల్ కమీషనర్ తదితర అధికారులు, సిబ్బందికి ఫైనల్ పబ్లికేషన్ ఓటర్ల లిస్ట్ పైన,ఎలక్షన్ క్లెయిమ్స్ పెండింగ్ పైన,ఓటర్ లిస్ట్ పైన దినపత్రికల్లో ప్రచురించిన వార్త కధనాలపై అలాగే రాబోయే 2024 ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఓటర్ల దినోత్సవమునకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బూత్ స్థాయి అధికారిగా ఎంపికైన గాండ్లపెంట మండలం పోలింగ్ కేంద్రం నెంబర్ 173 బూత్ స్థాయి అధికారి సి.వసుందరకి, డివిజనల్ అధికారి శ్రీ ఎం.సన్నీ వంశీ కృష్ణకి సన్మానం సభ ఏర్పాటు చేసి సత్కరించారు. ఓడిచెరువు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ అధ్యక్షతన బిఎల్ఓలకు సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్లు,ఓటర్ల జాబితా తదితర అంశాలపై సమీక్షించారు.ఈకార్యక్రమంలో బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు(విజయస్వప్నం రిపోర్టర్)