అయ్యప్ప స్వామి ఆలయంలో అఖండజ్యోతి దర్శనం 14 January, Sunday - ఓబులదేవరచెరువు మండలం ఎం.కొతపల్లి బండపైన వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో 14వ తేదిన అఖండజ్యోతి దర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ సంకల్పకులు పచార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ౧౮ కిలోల కర్పూరంతో అఖండజ్యోతిని వెలిగించనున్నారు, కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకోవాలని ఆయన తెలిపారు. మండల కేంద్రానికి చెందినా జోగ్గి రత్నమ్మ, రుద్రారెడ్డి దంపతులు అయ్యప్ప ఆలయానికి రూ. పదివేలు విలువ చేసే పంచలోహ దిమ్మెలను వితరణ చేసినట్టు ఆంజనేయులు నాయుడు తెలిపారు. youtube లో ప్రత్యక్షప్రసారం అయ్యప్ప స్వామి అఖండజ్యోతిని యూట్యూబ్ లో విజయస్వప్నం.నెట్ ఛానల్ ద్వార ప్రత్యక్ష ప్రసారం అవుతున్నది, కావున భక్తులు వేక్షించగలరు అని మనవి.