జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ 7 February, Wednesday హైదరాబాద్ - అనంతలో ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహా క్రికెట్ టోర్నీ ఆంధ్ర, తెలంగాణ లోని హైదరాబాదు సికింద్రాబాద్ సిటీ అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొనవచ్చు వైట్ బాల్, కలర్ డ్రెస్సులతో టోర్నమెంట్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు ప్రత్యేక ఎంట్రీ మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏ పి డబల్యూజెయు) రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డివర్కింగ్ జర్నలిస్టుల ఐకమత్యం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జర్నలిస్టు ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు అనంతపురం పట్టణంలోని ఆర్డిటి ప్రధాన క్రికెట్ మైదానంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు. టోర్నమెంట్ కు సంబంధించిన వివరాలను మచ్చ రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.రాష్ట్ర జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో ఇప్పటివరకు భారీ స్థాయిలో క్రికెట్ టోర్నీ ఎవ్వరూ నిర్వహించలేదని,రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా మొట్టమొదటి సారిగా అనంతపురం నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులందరూ ఆంధ్ర,తెలంగాణలోని హైదరాబాద్,సికింద్రాబాద్ సిటీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలలో వివిధ ఛానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొనవచ్చునని,అన్ని జిల్లాలకు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుందని ఈసందర్బంగా మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి గల జర్నలిస్టులందరూ పాల్గొనవచ్చునని,ఒక జిల్లాకు ఒకే జట్టు అనే నిబంధన ఏమీ లేదని,ఎన్ని జట్లు అయిన జర్నలిస్టులు క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉంటే అవకాశం ఇస్తామని అన్నారు.ఐపీఎల్ తరహాలో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ ఓపెన్ టోర్నమెంట్ రంగురంగు దుస్తులు,తెల్లని బంతితో నిర్వహిస్తారని,టోర్నమెంట్ లో పాల్గొనే అన్ని జర్నలిస్టు జట్లకు కలర్ టీ షర్ట్ ఒక్కొక్క జట్టుకి ఒక కలర్ కేటాయించి ఉచితంగా అందజేస్తారని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.వర్కింగ్ జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్నవాళ్లు అక్రిడేషన్ లేకపోయినా మేనేజ్మెంట్ పత్రిక గుర్తింపు కార్డు ఉన్నటువంటి విలేకరులు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చునని,కచ్చితంగా సంబంధిత మేనేజ్మెంట్ గుర్తింపు కార్డులు,లెటర్లు ఉన్న వారికి మాత్రమే టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.టోర్నమెంట్లో పాల్గొనే జర్నలిస్టులకు ఉచితంగా భోజనం,వసతి సౌకర్యం,ఒక కలర్ టీ షర్టు కూడా అందిస్తామని మచ్ఛా తెలిపారు.ఆంధ్ర, తెలంగాణలో పనిచేస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్టులకు ప్రత్యేక ఎంట్రీ ఇస్తామని,స్పోర్ట్స్ జర్నలిస్టులందరూ ఎన్ని టీంలైనా పాల్గొనవచ్చునని,టోర్నమెంట్లో విజేతకు ట్రోఫీని అందచేస్తామని,రన్నర్స్ గెలుపొందిన వారికి మూడో స్థానంలో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే టోర్నమెంట్లో రాణించిన జర్నలిస్టులకు బెస్ట్ బ్యాట్స్మెన్,బెస్ట్ బౌలర్ ఇతర ప్రత్యేక బహుమతులను ప్రదానం చేస్తామని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర,తెలంగాణ హైదరాబాద్,సికింద్రాబాద్ సిటీల్లో తదితర జిల్లాలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొని ఆడాలని,జర్నలిస్టులందరూ ఒక వేదిక మీద ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరు సహకారం అందించి విజయవంతం చేయాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.టోర్నమెంట్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టు క్రికెట్ జట్లు ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీలోపు తమ జట్టు ఎంట్రీలను అనంతపురం పట్టణంలోని సుభాష్ రోడ్డులో అంకుశం పత్రిక ప్రధాన కార్యాలయంలో అందజేయాలని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.టోర్నమెంట్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ప్రతి జర్నలిస్టు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,ఇతర వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు విజయ్ రాజు జిల్లా సెక్రెటరీ అనంతపురం. 9849152149, 9390997033, 7386958666 సంప్రదించవచ్చునని అయన కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APWJU) మరికొన్ని వార్తల కొరకు కింద లింక్ ని క్లిక్ చేయండి Click for more pics >>