తైక్వాందో లో గోల్డ్ మెడల్ సాధించిన బాలుడు 29 January, Monday - స్పోర్ట్స్ - కదిరి - జనవరి 27,28 తేదీలలో 6 వ విపా నేషనల్ తైక్వాందో ఛాంపియన్షిప్ 2024 బెంగళూరు లో జరిగిన యూ-14 (38 కేజీ) విభాగం లో కదిరి పట్టణానికి చెందిన సివి కృష్ణమూర్తి మనవడు సి.వి మనీష్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడని బాలుడు తండ్రి రిషిత చిన్న పిల్లల వైద్య నిపుణులు సి.వి మదన్ కుమార్ సోమవారం విజయస్వప్నం ప్రతినిధికి తెలిపారు.పుమ్ సే యూ-14(38 కేజీ) ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ....విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడని మనీష్ ఓయాసిస్ స్కూల్,హైదరాబాద్ లో కోచ్ భాస్కర్, కోచ్ నాగరాజ్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుండి సాధన చేస్తున్నాడని తెలిపారు.గోల్డ్ మెడల్ సాధించినందుకు కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.