చరిత్ర సృష్టించిన దినసరి కూలి ఎదుసార్లు గెలిచిన ఎం.ఎల్.ఎ పై ఘన విజయం 5 December, Tuesday - ఛత్తీస్ ఘడ్: 2023 డిసెంబర్ లో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉత్ఖంటంగా జరిగాయి. ఈ ఎన్నికలలో బి.జె.పి మూడు రాష్ట్రాల్లో విజయం సాధించగా తెలంగాణలో కాంగ్రెస్, మిజోరాం లో ప్రాంతీయ పార్టీ ZPM అనూహ్యంగా విజయం సాధించాయి. అయితే కట్టుదిట్టంగా సాగిన ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లో సాజ నియోజనవర్గం లో ఈశ్వర్ సాహు అనే దినసరి కూలి ఏడు సార్లు గెలిచిన ఎంఎల్ఎ రవీంద్ర చౌబే పై విజయం సాధించాడు.pic:internetఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దినసరి కూలి అయినటువంటి ఈశ్వర్ సాహు మత ఘఠ్షణలలో తన కుమారుడుని పోగొట్టుకున్నాడు. తన కుమారుడి మరణానికి రక్షణ సిబ్బంది రాజకీయ నాయకుల నుంచి సహకారం అందలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో న్యాయం కోసం పోరాడటానికి ఎన్నికలలో బీజేపీ తరపున నిలబడి, హృదయవిధారంతో తన కుమారుడి ఫోటోని చేతపట్టుకొని గడప గడప తిరిగి ప్రచారం చేసాడు. ప్రజలు సాహుకి మద్దతు తెలుపుతూ 5196 ఓట్ల తేడా తో రవీంద్ర చౌబే పై విజయాన్ని అందించారు