జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ప్రజా ప్రెస్ క్లబ్, అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో 19 February, Monday అనంతపురం - తనకల్ - రాప్తాడులో సిఎం సిద్ధం సభలో కొంతమంది అల్లరమూకలు ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై దాడి చేయడం దారుణమని సోమవారం ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండకమర్ల రెడ్డిబాష, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సౌజన్యంతో హైవేపై నిరసన తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాప్తాడులో సియం సిద్ధం సభలో కొంతమంది చిల్లరమూకలు ఆంధ్రజ్యోతి కృష్ణ పై బౌతిక దాడి చేసి గాయపరిచడం దారుణమని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఇటీవల పాత్రికేయులుపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అణిచివేయకపోతే భవిష్యత్తులో ప్రజల తరుపున ప్రశ్నించే వారు ఉండరని,ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ను భంగం కల్గించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.... రాష్ట్రములో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విలేకర్లపై దాడులు అధికమయ్యాయని, ఇలాంటి వైఖరి సమాజానికి మంచిది కాదని, దాడి చేసిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయకపోతే దాడులు పునరావృతమవుతయని, దాడి చేసినవారిని అరెస్ట్ చేసే వరుకు పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా వైస్ ప్రసిడెంట్ సోంపాళ్యం నాగభూషణ, మస్తాన్ వలి, సిపిఎం మండల కార్యదర్శి శివన్న,జిపిఎస్ రాయలసీమ నాయకులు మూడే ప్రసాద్ నాయక్, డిఎస్ఎస్ నాయకులు చిన్నప్ప, సిఐటియు డివిజన్ నాయకులు ఒంటెద్దు వేమన్న, వార్డు మెంబర్ తీరుపల్లి దామోదర్, శ్రీకాంతరెడ్డి, జనసేన నాయకులు, రవి, హర్షద్, శీనా, గంగులప్ప, తదితరులు పాల్గొన్నారు.