జనసేన కార్యాలయంలో.... ఘనంగా మహాత్మాగాంధీకి నివాళులు 30 January, Tuesday - కదిరి - పట్టణంలో మంగళవారం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి సందర్భంగా కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జీ భైరవ ప్రసాద్, కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ....దేశంలో రాజకీయ నాయకులకు ఒకటి రెండు విగ్రహాలు ఉన్నాయని,జాతిపితగా భావించే మహనీయులు మహాత్మాగాంధీకి కదిరి పట్టణంలో ఒక విగ్రహం లేకపోవడం శోచనీయమన్నారు.నీ ధర్మం నీ సంఘం నే దేశం మరవద్దు జాతిని పెంచి మమతను పంచిన మహనీయులనే మరవద్దు అటువంటి మహనీయుని త్యాగ నిరతికి కదిరి జనసేన పార్టీ తరపున నివాళి అర్పిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు,కదిరి పట్టణ ఉపాధ్యక్షులు కుటాలా లక్ష్మణ్ పేర్కొన్నారు(విజయస్వప్నం. నెట్ రిపోర్టర్,కదిరి) కదిరి పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీకి ఘన నివాళులు కదిరి - పట్టణ కాంగ్రెస్ నాయకుడు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మంగళవారం కదిరి టవర్ క్లాక్ సమీపంలో మున్సిపల్ రాణి పేట పాఠశాలలోన జాతి పిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినట్లు తెలిపారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకుడు చిలమత్తుర్ మోహన్ గాంధీ మాట్లాడుతూ అహింస మార్గన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మోహన్ దాస్ కర్మమ్ చంద్ గాంధీ వర్ధంతి సందర్బంగా బాపుజి జాతిపితా కి ఘనంగా నివాళులు ఆర్పిస్తూ,ఆశయాలు స్మరించుకుంటూ 1921 భారత జాతీయ కాంగ్రెస్ కి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ న్యాయకత్వం వహించి స్వరాజ్యం,స్వయం పాలనా సాధించడం కోసం దేశ వ్యాప్తంగా అయన త్యాగాలు ఎన్నటికీ మరపురానివి,సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి,కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్మరించు కుంటూ అహింస మార్గంలో,పరమత సహనం తో,ప్రజలు అందరూ ఐక్యమత్యంగా ప్రేమతో సోదర భావం తో కలసి మెలసి జీవించాలని,దేశన్ని ప్రగతి పథంలో తీసుకొని పోవాలన్నారు.ఈ కార్యక్రమం లో కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఖాదర్ బాషా,సమివుల్ల,భార్గవ్,మహేష్,జాఫర్ వలి,సాదిక్, చంద్ర,షహీద్,బాబా తదితర కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులు ఆర్పించారు.