60లో అంజనీ పుత్రుడు... చిరు 150వ సినిమా ఖరారు..? 22 ఆగస్టు, శనివారం హాపి బర్త్ డే... హైదరాబాద్ - వినోదం - ఆగష్టు 22 (నేడు) మెగాస్టారు చిరంజీవి 60వ పుట్టినరోజు కోసం అభిమానులు ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి వ్యక్తిగా షష్టిపూర్తి జరుపుకోవడం, 27 సంవత్సరాలు కెరీర్ పూర్తిచేయడం, 149 చిత్రాలలో నటించడం ఈ పుట్టినరోజు ప్రత్యేకతలు. ఐతే అభిమాన కథానాయకుడు మెగాస్టారు చిరంజీవి 7 ఏళ్లు నటజీవితానికి దూరంగా వున్న తరువాత చేయబోతున్న 150వ సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా..! అని ప్రేక్షకాభిమానులు కల్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టన రోజు కథా చర్చలు జరిపి త్వరలోనె(2016 ఆగష్టు 22) విడుదల చేయడానికి ప్రణాళికలతో ఉన్నట్లుగా పబ్లిక్ టాక్. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ -- కథతో సిధ్ధంగా ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఇదిలాఉండగా తాజాగ హిట్ డైరెక్టర్ రాజమౌళి అంజనీ పుత్రుడు టైటిల్ తో, అలాగే వి.వి.వినాయక్ ప్రజాభిమాని టైటిల్ తో, శ్రీను వైట్ల ఆదర్శవంతుడు కథతో సిధ్ధంగా ఉన్నట్లుగా సినీప్రేక్షకులు చర్చించుకోవడం విశేసం.