సినీ దర్శక నిర్మాత అక్కమ్మగారి సూర్యనారాయణ:కదిరి ప్రాంతవాసులు అంతర్జాతీయ స్థాయిలో చారిత్రాత్మక గౌరవం 5 February, Monday అంతర్జాతీయం - వినోదం - ప్రొడ్యూసర్,డైరెక్టర్ అక్కమ్మ గారి సూర్యనారాయణకి అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులు వరించాయి. బెస్ట్ తెలుగు ఫిలిం డైరెక్టర్ గా దోస్తాన్ మూవీకి బెస్ట్ తెలుగు కాన్సెప్ట్ ఫిలింగా అవార్డులు అనుకున్నారు.4వతేది ఆదివారం రాత్రి తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కదిరికి చారిత్రాత్మక గౌరవం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది.కదిరి పట్టణానికి చెందిన ప్రొడ్యూసర్ & డైరెక్టర్ శ్రీ అక్కమ్మగారి సూర్యనారాయణకి అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ తెలుగు ఫిలిం డైరెక్టర్ గా, దోస్తాన్ మూవీకి బెస్ట్ తెలుగు కాన్సెప్ట్ ఫిలిం గా అవార్డు అందుకున్నారని తెలిపారు.అవార్డు అందుకొన్న సందర్బంగా అక్కమ్మగారి సూర్యనారాయణ మాట్లాడుతూ....ఈ దోస్తాన్ మూవీకి ఇంత అరుదైన గౌరవం రావడం చాలా సంతోషంగా ఉందని,అలాగే తమ మూవీకి కష్టపడ్డ మూవీ టీం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే ఈ మూవీలో సిద్ స్వరూప్,ఆర్ కార్తికేయ,ఇందు ప్రియా,ప్రియా వల్లభి హీరో,హీరోయిన్లుగా నటించారన్నారు.డిపిడి వెంకటేష్ కర్రీకి,రవిరెడ్డికి,ఎడిటర్ సుదీర్ కుమార్ కి,మ్యూజిక్ డైరెక్టర్ ఎల్లెందర్ మహావీర్ కి కో-డైరెక్టర్ గణేష్ ముత్యాలకి,అసిస్టెంట్ డైరెక్టర్ బాదుల్లా,కన్న, బి.పవన్ కుమార్ (ముత్యాల చెరువు పవన్ కుమార్)హైదరాబాది షాకీర్ తోపాటు సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అరుదైన గౌరవం దక్కడంతో కదిరికి ఆణిముత్యంగా అభివర్ణిస్తూ.... పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Click for more pics >>