సాహసం చేసిన మోదీ.. సముద్ర గర్భంలోకి వెళ్లి 26 February, Monday జాతీయం - భక్తి-ఆరోగ్యం - గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి సాహసమే చేశారు. ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను PMO ట్విటర్లో షేర్ చేసింది. ప్రార్థనా స్థలంలో మోదీ ధ్యానం చేస్తూ నెమలి ఈకలను ఉంచి నమస్కరించారు. ఈ చర్యతో ద్వారకా టూరిజం మరింత పెరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.